Free YouTube Transcribe

Video transcript

Iphone Screen Protector : ఐఫోన్‌కు స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ అక్కర్లేదు!ఎందుకంటే..? - TV9

TV9 Telugu Digital · 235 words · 2 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00కొత్త ఐఫోన్ కొని ఇంటికి రాగానే మనందరం

0:02చేసే మొదటి పని వెంటనే దానికి ఒక బ్యాక్

0:04కవర్ స్క్రీన్ పై మంచి టెంపర్డ్ గ్లాస్

0:06ప్రొటెక్టర్ వేయించటం లక్షల రూపాయలు

0:08పెట్టి కొన్న ఫోన్ కింద పడితే డిస్ప్లే

0:10పగిలిపోతుందేమో అన్న భయంతో ఇలా చేస్తాం.

0:12అయితే ఐఫోన్ కు స్క్రీన్ ప్రొటెక్టర్

0:14వాడటం అసలు తనకు ఇష్టం ఉండదని అలా పెడితే

0:17అసహనంగా కనిపిస్తుందని appపిల్ హార్డ్వేర్

0:20ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మారిఫ్

0:22అన్నారు. ఐఫోన్ స్క్రీన్ ను చాలా అందంగా

0:24దృఢంగా తయారు చేయడానికి తాము ఎంతో

0:26శ్రమిస్తున్నామని దానిపై మరో ప్లాస్టిక్

0:28లేదా గ్లాస్ లేయర్ వేయడం వల్ల స్క్రీన్

0:30ఒరిజినాలిటీఏ పోతుందని ఆయన

0:32చెప్పుకొచ్చారు.

0:34[సంగీతం]

0:37appపిల్ తమ ఐఫోన్ డిస్ప్లేల కోసం సిరామిక్

0:40షీల్డ్ 2 టెక్నాలజీని ఉపయోగిస్తుందని ఇది

0:42గీతలను తట్టుకోవడంలో గత తరం కంటే మూడు

0:45రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉందని

0:46మారిపు తెలిపారు. మార్కెట్లోని ఇతర

0:48స్మార్ట్ ఫోన్ల గ్లాసుల కంటే ఇది ఎంతో

0:50మన్నికైనదని ఆయన స్పష్టం చేశారు. ఐఫోన్

0:53డిస్ప్లే నాణ్యతను పరీక్షించేందుకు

0:54నిరంతరం వాడటం గీతలు పడటం వంటి

0:56పరిస్థితులను క్రియేట్ చేసి కేవలం కొన్ని

0:59వారాల వ్యవధిలోనే ఐదేళ్ల వాడకానికి

1:01సంబంధించిన టెస్టింగ్ పూర్తి చేశమని

1:02వెల్లడించారు. కొత్త ఐఫోన్ స్క్రీన్లపై

1:05కాంతి పడినప్పుడు ప్రతిబింబాలు రాకుండా

1:07ప్రత్యేకమైన యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్

1:09ఇచ్చారు. దీనివల్ల ఎండలో కూడా దీని

1:11స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే

1:13దీనిపై సాధారణ స్క్రీన్ ప్రొటెక్టర్లు

1:15వేయడం వల్ల రిఫ్లెక్టివిటీ రెట్టింపయి

1:18డిస్ప్లే క్వాలిటీ తగ్గుతుందని నిపుణలు

1:20చెప్తున్నారు. అయితే పై వాదనలను కస్టమర్లు

1:22కొట్టి పారేస్తున్నారు. గ్లాస్ ఎంత బలంగా

1:24ఉన్నా అది కేవలం స్క్రాచ్ రెసిస్టెంట్

1:26మాత్రమే కానీ స్క్రాచ్ ప్రూఫ్ కాదని వారు

1:29చెబుతున్నారు. పైగా బోలెడ్ డబ్బు పోసి

1:31కొన్న ఫోన్ పొరపాటున కింద పడితే దెబ్బ

1:33తినే ప్రమాదం ఉన్నందున కాస్త ఖరీదైన

1:35స్క్రీన్ గార్డ్ వేయించుకోవడమే మంచిదని

1:37వారు సలహా ఇస్తున్నారు. కాకపోతే నాణ్యత

1:39లేని తక్కువ ధర టెంపాడ్ గ్లాసులు వాడితే

1:42ఐఫోన్ అసలైన డిస్ప్లే క్వాలిటీ టచ్

1:44రెస్పాన్స్ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి.

1:47[సంగీతం]

More from TV9 Telugu Digital

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.