Free YouTube Transcribe

Video transcript

Infant world Record | పుట్టగానే పాస్‌పోర్ట్‌...ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి - TV9

TV9 Telugu Digital · 160 words · 1 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00పుట్టగానే పువ్వు పరిమలిస్తుంది

0:01అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ

0:03బుజ్జాయి అరుదైన ప్రపంచ రికార్డును తన

0:05ఖాతాలో వేసుకుంది. పుట్టిన 13 రోజుల

0:07వ్యావధిలోనే పాస్పోర్ట్ సాధించి యంగెస్ట్

0:10పాస్పోర్ట్ హోల్డర్ గా ఇంటర్నేషనల్ బుక్

0:11ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

0:13శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి

0:15చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపు

0:17వెంకటేష్ మనవరాలు వజ్రపు అగస్త్య ప్రిన్సి

0:20ఈ ఘనత సాధించింది. గతంలో 19 రోజుల పసికందు

0:23పేరుట ఉన్న రికార్డును ఈ పాప అధిగమించడం

0:25విశేషం. వివరాల్లోకి వెళితే వెంకటేష్

0:28కుమారుడు ఆశీష్ కోడలు గీతా మాధురి దంపతులు

0:30ఉద్యోగ రిత్య లండన్ లో స్థిరపడ్డారు. గీతా

0:32మాధురి రాజమహేంద్రవరంలో మే 30న అగస్త్య

0:35ప్రిన్సికి జన్మనిచ్చారు. తిరిగి లండన్

0:37వెళ్ళాల్సి ఉండటంతో పాపకు పాస్పోర్ట్

0:39అత్యవసరమైంది. దీంతో తల్లిదండ్రులు వెంటనే

0:41ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా జూన్

0:431న బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. దాని

0:45ఆధారంగా జూన్ 2న బాల ఆధార్ కోసం దరఖాస్తు

0:49చేయగా కేవలం రెండు రోజుల్లోనే జూన్ 4న

0:51ఆధార్ కార్డు అందింది. ఆ వెంటనే జూన్ 6న

0:54పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోగా అన్ని

0:55ప్రక్రియలు పూర్తయి జూన్ 12న పాస్పోర్ట్

0:58మంజూరయింది. అంటే పుట్టినప్పటి నుంచి

1:00కేవలం 13 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం

1:02పూర్తి కావడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్

1:04రికార్డ్స్ దీనిని అధికారికంగా

1:06గుర్తించింది. పసి వయసులోనే ఈ రికార్డు

1:08సాధించడం పట్ల చిన్నారి కుటుంబ సభ్యులు

1:10హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from TV9 Telugu Digital

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.