Free YouTube Transcribe

Video transcript

భారత్‌లో ఆదాయ అసమానతలపై వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్

ETV Telangana · 278 words · 2 min read

WhatsAppTelegramX

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00ఓల్డ్ బ్యాంక్ విడుదల చేసిన పావర్టీ అండ్

0:02ఇనీక్వాలిటీ ప్లాట్ఫామ్ 2026 నివేదికలో

0:04దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలడయ్యాయి.

0:06ప్రపంచంలోని సంపన్న దేశాల్లో అత్యంత పేద

0:09వర్గాలకు చెందిన ప్రజల జీవన ప్రమాణాలు

0:11భారత్లోని టాప్ 10 శాతం ధనికుల జీవన

0:13ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నాయని ఈ

0:15నివేదిక స్పష్టం చేసింది. మన దేశంలో ధనిక

0:18పేద వ్యత్యాసాలను తగ్గించడమే కాకుండా

0:20సమగ్రంగా ప్రజలందరి ఆదాయాలను పెంచాల్సిన

0:23అవసరం ఉందనే చర్చకు ఈ నివేదిక తెరలేపింది.

0:28వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్లో

0:30అత్యంత పేదలైన 10 శాత మంది రోజువారి రాబడి

0:34లేదా వినియోగ వ్యయం సగటున3 డాలర్లు అంటే

0:37సుమారు 287 మాత్రమే. అదే సమయంలో అమెరికాలో

0:42దిగువ వర్గానికి చెందిన 10 శాత మంది

0:44రోజువారి ఆదాయం 25 డాలర్లుగా ఉంది.

0:47కెనడాలో ఇది 31 డాలర్లు కాగా జర్మనీ

0:50ఆస్ట్రేలియాలలో 28 డాలర్లుగా నమోదయింది.

0:54ఇక సంపన్నుల విషయానికి వస్తే భారత్లో

0:56అత్యధిక ఆదాయం పొందే టాప్ 10%లో ఉండాలంటే

1:00రోజుకు 10 డాలర్లు అంటే సుమారు 950

1:03రూపాయలు ఖర్చు చేసే లేదా సంపాదించే

1:05సామర్థ్యం ఉంటే సరిపోతుంది. మన ఆర్థిక

1:08సర్వే ప్రకారం నెలకు 80వేల రూపాయలు

1:10సంపాదించే వ్యక్తి దేశంలోనే అత్యంత

1:13ధనికులైన 10 శాత మందిలో ఒకరిగా

1:16నిలుస్తున్నారు. అమెరికాలోని సంపన్నులతో

1:18పోలిస్తే ఈ ఆదాయం చాలా స్వల్పం.

1:21అమెరికాలోని టాప్ 10% ధనికుల రోజువారి

1:24ఆదాయం 173 డాలర్లు కాగా కెనడా

1:27ఆస్ట్రేలియాలలో 129 డాలర్లు జర్మనీలో 128

1:31డాలర్లుగా ఉంది. అంటే భారత్లో ధనికులుగా

1:34పరిగణించబడుతున్న వారి కంటే అభివృద్ధి

1:36చెందిన దేశాల్లోని పేదల జీవన ప్రమాణాలే

1:39మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం

1:41చేస్తోంది.

1:43[సంగీతం]

1:48[సంగీతం]

1:50ఈ నివేదికపై స్పందించిన నిపుణులు ఇది

1:52కేవలం సంపద పంపిణీలోని వ్యత్యాసం మాత్రమే

1:55కాదని భారత్లో మొత్తం ఆర్థిక వ్యవస్థలోనే

1:57ఆదాయాలు తక్కువగా ఉన్నాయి అనడానికి

1:59నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం పేదలను

2:02ధనికుల స్థాయికి తీసుకురావడం వల్ల దేశం

2:05సంపన్న దేశంగా మారదని దేశవ్యాప్తంగా

2:07ఉత్పాదకతను పెంచడం అత్యంత కీలకమని

2:10అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక వేత్తలు

2:12కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించే

2:15వాతావరణం కల్పించడం వ్యాపార నిబంధనలు

2:17సులభతరం చేయడం స్థిరమైన పన్ను విధానాలు

2:20ఒప్పందాలను వేగంగా అమలు చేయడం పారిశ్రామిక

2:23క్లస్టర్లను బలోపేతం చేయడం ద్వారానే ఇది

2:26సాధ్యమవుతుందని నిపుణలు చెబుతున్నారు.

2:28మొత్తానికి భారత్ కేవలం పేదరిక నిర్మూలన

2:31పైనే కాకుండా దేశంలో వ్యాపార అనుకూల

2:34వాతావరణాన్ని పెంచి ప్రతి ఒక్కరి ఆదాయాలను

2:37పెంచే దిశగా మరిన్ని సంస్కరణలు

2:39చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ వరల్డ్

2:41బ్యాంక్ నివేదిక స్పష్టం చేస్తుంది.

More from ETV Telangana

All 3 transcripts from ETV Telangana

Recently added transcripts

Browse the whole transcript library Browse all Telugu transcripts

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.