Free YouTube Transcribe

Video transcript

2030 నాటికి AI మానవాళిని అంతం చేస్తుందా? | Anthropic పరిశోధకుడి సంచలన హెచ్చరిక

ETV Telangana · 288 words · 2 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుందా లేక

0:03మానవాలని అంతం చేస్తుందా? ఇప్పుడు

0:05సిలికాన్ వ్యాలీ నుంచి వస్తున్న వార్తలు

0:07వింటే ఎవరికైనా వెన్నులో వణకు

0:09పుట్టాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

0:11రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంత్రోపిక్

0:13సంస్థకు చెందిన 27 ఏళ్ల ప్రముఖ రీసెర్చర్

0:16జాకబ్ కాక్సన్ తన ఉద్యోగానికి రాజీనామా

0:18చేశారు. నిష్క్రమిస్తూ ఆయన చేసిన ప్రకటనలు

0:21ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం

0:23రేపుతున్నాయి. ఈ దశాబ్దం ముగిసేసరికి ఏఐ

0:26మానవాళి ఉనికినే తుడిచి పెట్టేస్తుందంటూ

0:29జాకోబ్ కాక్సన్ బాంబు పేల్చారు. అసలు

0:31ఓపెన్ ఏఐ ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థల

0:34లోపల ఏం జరుగుతోంది? టెక్ ప్రపంచాన్ని

0:36భయపెడుతున్న ఆ ముప్పుఏంటి ఈ కథనంలో

0:39చూద్దాం.

0:42ఓపెన్ ఏఐ ఆంత్రోపిక్ వంటి అగ్రగామి

0:44సంస్థలలో గత మూడేళ్లుగా ప్రీ ట్రైనింగ్

0:46రీసర్చర్ గా పనిచేసిన జాకోబ్ కాక్సన్ ఏఐ

0:50రేస్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బయటక

0:52వచ్చేశారు. ఆ కంపెనీల బాధ్యతా

0:54రాహిత్యాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా

0:57ఎండగట్టారు. కంపెనీలు పోటీ పడి మరి సెల్ఫ్

1:00ఇంప్రూవింగ్ సూపర్ ఇంటెలిజెన్స్ ను వేగంగా

1:02అభివృద్ధి చేస్తున్నాయని ఇది మనుషుల

1:04ప్రాణాలతో చెలగాట మాడటమేనని కాక్సన్

1:06హెచ్చరించారు. ఈ దశాబ్దం ముగిసేసరికి ఏఐ

1:09మానవాళని అంతం చేస్తుందని ఎగ్జిక్యూటివ్లు

1:12బలంగా నమ్ముతున్నారని ఆయన సంచలన నిజాలు

1:14బయట పెట్టారు. త్వరలోనే మనుషుల కంటే

1:17అత్యంత తెలివైన సూపర్ సిస్టమ్స్

1:19రాబోతున్నాయని అవి దేన్నైనా హ్యాక్

1:21చేయగలవని ఏ రంగాన్నైనా రాత్రికి రాత్రి

1:24మార్చేసి అనంతమైన శక్తిని సొంతం

1:26చేసుకుంటాయని స్పష్టం చేశారు. ఆసక్తికరమైన

1:29విషయం ఏమిటంటే కాక్సన్ ఆరోపణలను

1:31ఆంత్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్

1:34హుబింగ్ గారు కూడా అంగీకరించడం. ఏఐ

1:36కారణంగా రాబోయే 10ఏళ్లలో మానవాళి అంతమయ్యే

1:39ప్రమాదం 10 శాతనికి పైగానే ఉందనే

1:42విషయాన్ని ఆయన సైతం అంగీకరించడం గమనార్హం.

1:45సూపర్ ఇంటెలిజెన్స్ ను కంట్రోల్ చేసే

1:47పక్కా ప్రణాళిక తమ వద్ద ఇంకా లేదని ఆయన

1:49ఓపెన్ గా ఒప్పుకున్నారు. మరోవైపు ఓపెన్ ఏఐ

1:52ఈ ముప్పును తీవ్రంగా పరిగణించడం లేదని

1:55ఆంత్రోపిక్కు ప్రమాదమని తెలిసిన పోటీలో

1:57వెనుకబడిపోతామేమో అనే భయంతోనే ఆగకుండా

2:00ప్రమాదకరమైన రీసెర్చ్ను కొనసాగిస్తుందని

2:03కాక్సన్ స్పష్టం చేశారు. ఇటీవల దిగ్గజ

2:06వ్యాపారవేత్త ఎలన్ మస్క్ సైతం ఆంత్రోపిక్

2:09మోడల్ సామర్థ్యాన్ని ప్రశంసించిన

2:10నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యతను

2:13సంతరించుకున్నాయి. ఏది ఏమైనా ఏ ఏ సంస్థల

2:16లోపల పని చేస్తున్న శాస్త్రవేత్తలే

2:19స్వయంగా బయటికవచ్చి ఇలాంటి హెచ్చరికలు

2:21చేయడం మానవాళి భవిష్యత్తుపై అనేక

2:23అనుమానాలను రేకెత్తిస్తుంది. సాంకేతిక

2:26పురోగతి పేరుతో లాభాల వేటలో పడి మనుషుల

2:28ఉనికికే ఎసరు తెచ్చే ఈ ఏఐ రేస్ ను ప్రపంచ

2:32దేశాలు ఎలా అడ్డుకుంటాయో వేచి చూడాలి.

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.