Full transcript
0:00ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు ఈరోజు
0:04మనమందరం ఒక ప్రత్యేకమైన సందర్భంలో కూడి
0:07ఉన్నాము. బిషప్ సీయోన్ రాజ్కుమార్ గారు
0:10అపోస్తలిక్ అసెంబ్లీ పరిచర్యలోకి వచ్చి 10
0:13సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా
0:16ఆయన సేవా ప్రయాణాన్ని మీతో పంచుకునే గొప్ప
0:19అవకాశము నాకు దేవుడు ఇచ్చినందుకు ముందుగా
0:23దేవునికి నా హృదయపూర్వక వందనాలు
0:24తెలియజేస్తున్నాను. అయితే ఈ 10 సంవత్సరాల
0:28ప్రయాణాన్ని తెలుసుకోవాలంటే అపోస్తలిక్
0:31అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టిన రోజు నుంచే
0:34ప్రారంభించడం సరిపోదు. ఆయన సేవా జీవితం
0:37ఎలా ప్రారంభమయింది ఆయన జీవన విధానం ఎలా
0:41ఉండేది దేవునితో ఆయన ప్రయాణం ఎలా సాగింది
0:45ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయనను దేవుడు
0:48నడిపించాడు. ఈ విషయాలన్నిటిని మీ
0:51ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. ఇది
0:54కేవలం ఒక వ్యక్తి గురించి చెప్పే కథ కాదు
0:57ఒక మనిషి జీవితాన్ని దేవుడు ఎలా తీసుకొని
1:01తన పరిచర్యకు ఉపయోగించుకున్నాడో
1:03తెలియజేసే ఒక సాక్ష్యం కాబట్టి ఆయన
1:07అపోస్తలిక్ అసెంబ్లీ పరిచర్యలోకి రాకముందు
1:11ఉన్న ఆయన జీవితం నుండి ఈ ప్రయాణాన్ని
1:13ప్రారంభిద్దాం.
1:15ఒక ఉద్యోగి నుంచి దేవుని పరిచారకుడిగా
1:19బిషప్ సీయోను రాజకుమార్ గారు 1980 లో
1:23జన్మించారు. తండ్రి యేసుదాసు గారు తల్లి
1:26విశ్రాంతి కుమారి గారు భార్య ఉషా గ్రేస్
1:30గారు ఇద్దరు కుమారులు ఎంతో ఆనందంగా
1:33సంతోషంగా సాగిన మంచి కుటుంబ జీవితం చదువు
1:37పూర్తి చేసిన తర్వాత ఆయన స్టీల్ ప్లాంట్
1:40లో ఇంజనీర్ గా ఉద్యోగం చేశారు. మంచి
1:43స్నేహితులు మంచి ఉద్యోగం సంతోషకరమైన
1:46జీవితం అన్ని సవ్యంగానే సాగుతున్న సమయంలో
1:50ఇతర కంపెనీల నుంచి కూడా స్నేహితుల ద్వారా
1:53మంచి ఉద్యోగ అవకాశాలు ఆయనకు వచ్చాయి కానీ
1:57ఆయన డబ్బు గురించి ఆశపడలేదు. ఆయన తన
2:00ఉద్యోగంతో సంతృప్తిగా ఉండేవారు. అయితే ఒక
2:04సందర్భంలో ఉద్యోగంలో పై అధికారుల ద్వారా
2:08ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన
2:11రాజీనామా చేశారు. స్నేహితులు ఇచ్చిన
2:14ఉద్యోగ అవకాశాల కోసం స్నేహితులకు ఫోన్
2:17చేయగా వారు ఒక్కసారి ఫోన్ ఎత్తి మలా ఫోన్
2:21చేయలేదు. అప్పుడు ఆయన జీవితంలో ఒక కీలకమైన
2:25మలుపు వచ్చింది. దేవా ఇంక నేను ఏం చేయాలి?
2:29తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోదాం
2:32అని నిర్ణయించుకొని వెళ్లే ముందు మూడు
2:36రోజుల ఉపవాస ప్రార్థనకు ఆయన
2:38నిర్ణయించుకున్నారు.
2:40మూడు రోజుల ఉపవాసంలో
2:43మూడవ రోజు సాయంత్రానికి శరీరం బాగా
2:46నేరసించిన ప్రార్థనలో కొనసాగారు. ఆ సమయంలో
2:51ఆయనకు ఒక దర్శనం కలిగిందని ఆయన సాక్ష్యంగా
2:55తెలియజేశారు.
2:56ఒక బీడు భూమి పగుళ్ళతో నిండిన నేల అందులో
3:02ఆయన ఒక కాలు ఇరుక్కుపోయి బయటకు రావడానికి
3:06ప్రయత్నిస్తున్న పరిస్థితి చాలా ఇబ్బందిగా
3:10ఉన్న పైకి లేవలేని పరిస్థితి అప్పుడు
3:14ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చి సీయోన్ అని
3:18పిలిచి చేయి అందించినట్లు ఆయనకు
3:22అనిపించింది. ఆ చేయిని పట్టుకున్న వెంటనే
3:26తనలో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లు
3:29బలంతో లేచి నిలబడినట్లు ఆయన అనుభవించారు.
3:34ఆ తర్వాత ఆ వెలుగు రూపం ఆయన భుజంపై చెయ్యి
3:38వేసి ఒక స్నేహితునిలా ఒక బీడు భూమిలో
3:42నడిపిస్తూ దేవుని వాక్యముతో బలపరిచి
3:46ధైర్యపరిచారు.
3:47ఆ రూపం పైకి వెళ్ళిపోయిన తరువాత ఆయన
3:51చూసినప్పుడు బీడుభూమి పచ్చని పంట పొలంగా
3:55మారినట్లు కనిపించింది. ఆ దర్శనంలో ఆయనకు
4:00వచ్చిన సందేశం సీయోన్ నీవు కేవలము
4:04విశ్వాసులను తయారు చేయడం కాదు సేవకులను
4:08సరిచేసి శిష్యులుగా తయారు చేయాలి అని
4:11దేవుని ఆత్మ తెలియపరిచింది. ఆ మాటలను ఆయన
4:16తన హృదయములో భద్రపరచుకున్నారు. అక్కడి
4:19నుంచే ఒక కొత్త ప్రయాణం ప్రారంభమయింది.
4:22దేవుని సేవ కోసం పిలుపు పొందిన ఒక
4:26పరిచారకుని జీవితంగా మారడం ప్రారంభమయింది.
4:30తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు గొప్ప సేవా
4:33దృక్దంతో
4:35విశ్వాస ప్రయాణములో దేవుని తోడు
4:39ఉద్యోగాన్ని విడిచి పూర్తికాల పరిచర్యకు
4:43అంకితమైన తర్వాత బ్రదర్ సీయోన్ రాజ్కుమార్
4:47గారు తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి
4:50వచ్చారు. అయితే ఆయన తండ్రి గారి నుండి
4:53వ్యతిరేకత ఎదురైంది. నీ వయసుఎంత మంచి
4:57ఉద్యోగం ఎందుకు వదిలేసావు ఉద్యోగం
5:01చేస్తూనే దేవుని సేవ చేయవచ్చు కదా అని
5:04తండ్రి గారు తరచూ ప్రశ్నించేవారు ఆ మాటలు
5:08ఆయనకు ఎంతో బాధ కలిగించేవి ఆ బాధలో ఆయన
5:12కొంతకాలం ఒక ప్రత్యేకమైన గది తీసుకొని
5:16ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థనలో
5:20దేవుని వాక్య ధ్యానములో స్తుతిలో
5:23గడిపేవారు శారీరకంగా
5:26ఒంటరిగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా
5:30దేవుని సన్నిధిలో బలపడేవారు ఆ సమయంలో ఆయన
5:34తల్లిగారు మాత్రం తన కుమారుడికి ఎంతో
5:37ఆత్మీయమైన
5:39సహాయకురాలిగా నిలిచారు. ఆయన కోసం
5:42ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవారు నా
5:46తండ్రియు నా తల్లియు నన్ను విడిచినను
5:50యెహోవా నన్ను చేర్చుకొనును కీర్తనలు 27వ
5:55అధ్యాయము 10వ వచనం ఒకరోజు ఆయన వద్ద ఆటోలో
6:00వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు ఆఫీస్
6:03దగ్గర నుండి ఇంటి వరకు నడుచుకుంటూ
6:06వెళ్ళాలని బయలుదేరారు. మార్గ మధ్యములో ఒక
6:10వ్యక్తి వచ్చి ఆయన భుజం పై చెయ్యి వేసి
6:14ఎంతో సన్నిహితమైన స్నేహితునిలా ఆయనతో పాటు
6:18నడవసాగాడు.
6:20ఆ వ్యక్తి మార్గమంతా నడుస్తూ
6:24దేవుని విషయాలు తెలియపరుస్తూ
6:27దేవుని వాక్యాలు చెబుతూ ఆయనను
6:29ప్రోత్సహించాడు.
6:32రోడ్డుపై కార్లు బస్సులు లారీలు వేగంగా
6:37వస్తున్నప్పటికీ వాటి మధ్య నుండి
6:39నడుస్తున్నా కూడా వారికి దెబ్బలు తగలడం
6:43లేదు దేవుని వాక్యముతోనే ఆ వ్యక్తి బిషప్
6:47గారిని ఆయనతో పాటు నడుస్తూ ఇంటి వరకు
6:50తీసుకు వెళ్ళారు. చివరకు ఇంటి దగ్గర ఆయనను
6:54దించి వెళ్ళిపోయాడు. ఆ రోజు సీయోన్
6:57రాజ్కుమార్ గారికి ఒక గొప్ప ఆత్మీయ సత్యం
7:01మరింత స్పష్టమైంది.
7:03మనుషులు మనలను అర్థం చేసుకోకపోయినా
7:07దేవుడు మనలను విడిచిపెట్టడు మనకు మార్గము
7:10కనిపించకపోయినా
7:12ఆయన మనలను నడిపిస్తాడు. మన చేతిలో డబ్బు
7:16లేకపోయినా ఆయన దగ్గర మన అవసరాలకు మార్గం
7:20ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను
7:24నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము
7:27చేసుకొనుము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ
7:30అధ్యాయము రెండవ వచనము నీ మాట నా పాదములకు
7:35దీపము నా త్రోవకు వెలుగు కీర్తనలు 119వ
7:41అధ్యాయము 105వ వచనము ఆ రోజు ఆయనతో నడిచిన
7:46ఆ వ్యక్తి ఎవరో మనకు ఖచ్చితముగా
7:50తెలియకపోయినా
7:51ఆ సంఘటన ద్వారా దేవుడు ఆయనను ధైర్యపరిచి
7:56తన సేవలో ముందుకు నడిపించాడని ఆయన విశ్వాస
8:00ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అనుభవంగా
8:03నిలిచింది. వ్యతిరేకత వచ్చినా వెనక్కి
8:07తగ్గకూడదు ఒంటరితనం వచ్చినా ప్రార్థన
8:10ఆపకూడదు.
8:12అవసరం వచ్చినా విశ్వాసం కోల్పోకూడదు
8:16ఎందుకంటే దేవుని పిల్లలు నడిచే మార్గములో
8:20దేవుడే ముందుండి నడిపిస్తాడు. భయపడకుము
8:24నేను నీతో ఉన్నాను దిగులు పడకుము నేను నీ
8:28దేవుడను యష్యా 41వ అధ్యాయము 10వ వచనము
8:34అనాధ పిల్లలకు అండగా నిలిచిన పరిచర్య ఆ
8:39విధంగా పరిచర్య ప్రారంభమైనప్పుడు అనేకమంది
8:43అనాధ పిల్లలను చూసి బిషప్ గారి హృదయం
8:46చలించిపోయింది. ఆ పిల్లలకు అండగా ఉండాలని
8:50నిర్ణయించుకొని ఒక హోమ్ ఏర్పాటు చేసి
8:54వారికి అవసరమైన వసతులు కల్పిస్తూ
8:56విద్యాబుద్ధులు నేర్పించారు. నేడు ఆ
9:00పిల్లలలో కొందరు నర్సులుగా టీచర్లుగా మంచి
9:05గృహణీలుగా దేవుని యందు భయభక్తులతో చక్కగా
9:09జీవిస్తున్నారు. ఈ పరిచర్యలో బిషప్ గారి
9:12తల్లిదండ్రులు భార్యా పిల్లలు కూడా కలిసి
9:16సేవ చేశారు. ఏ ట్రస్ట్ నిధులను
9:19ఆశ్రయించకుండా తమ సొంత ఖర్చులతోనే ఈ సేవను
9:23కొనసాగించారు.
9:25చిన్నవారిలో ఒకనికి మీరు చేసినది నాకే
9:29చేసినది మత్తయి 25వ అధ్యాయము 40 వ వచనం
9:35ఇది కేవలం ఒక హోమ్ కాదు అనాధ పిల్లలకు ఒక
9:39కుటుంబాన్ని భవిష్యత్తును దేవుని ప్రేమను
9:43అందించిన పరిచర్య బిషప్ సీయోన్ రాజ్కుమార్
9:47గారు ఒరిస్సా రాయిగడ మునిగడ తదితర కొండ
9:53ప్రాంతాల్లో అటవి ప్రాంతాలు లో ఎన్నో
9:56కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజల వద్దకు
9:59కొంతమంది సేవకులను తీసుకొని మార్గం లేని
10:03ప్రాంతాలకు వెళ్లి పరిచర్య చేసేవారు ఎంతో
10:06ఎత్తుగా ఉన్న కొండలు ఎక్కి అక్కడ సువార్త
10:09ప్రకటించేవారు అక్కడ ప్రజలకు ఆహారం మందులు
10:13బట్టలు వంటి కనీస అవసరాలను
10:17తన భార్యతో పాటు వెళ్లి వారికి అందిస్తూ
10:20వారితో కొన్ని రోజులు ఉండి ఆత్మీయంగా
10:23బలపరిచి తిరిగి వచ్చేవారు ఒకసారి
10:27రాత్రివేళ ఆయన నిద్రిస్తున్న ప్రదేశానికి
10:31సమీపంలో ఉన్న కోళ్ళగంప వద్దకు చిరుతపులి
10:35వచ్చి కోళ్ళన్నిటిని తినేసి
10:37వెళ్ళిపోయింది. అయితే పక్కనే
10:40నిద్రిస్తున్న బిషప్ గారికి ఎటువంటి హాని
10:43జరగలేదు. అది ఆయన పరిచర్యలో
10:46దేవుని అద్భుతమైన కాపుదలకు ఒక సాక్ష్యముగా
10:50నిలిచింది. యెహోవా దూత ఆయనకు భయపడు వారి
10:54చుట్టూ కావలి యుండును వారిని విడిపించును
10:58కీర్తనలు 34వ అధ్యాయము ఏడవ వచనము దేవుడు
11:04తెరిచిన ఒక అంతర్జాతీయ ద్వారం
11:07ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ పరిచర్యను
11:11అమెరికాకు చెందిన ఒక ఆత్మీయ తల్లిగారు
11:14గమనించి అక్కడ జరుగుతున్న సేవకు
11:17అమెరికాలోని అపోస్తలిక్ అసెంబ్లీ
11:20పరిచర్యతో సారూప్యత ఉందని గుర్తించారు.
11:23ఆమె ద్వారా సీయోన్ రాజ్కుమార్ గారు
11:26అమెరికాలోని అపోస్తలిక్ అసెంబ్లీ
11:29నాయకత్వాన్ని పరిచయం చేయబడ్డారు. ఆ పరిచయం
11:33ఒక కొత్త ద్వారాన్ని తెరిచింది. ఆ తరువాత
11:37ఆయన పరిచర్య అపోస్తలిక్ అసెంబ్లీ
11:40పరిచర్యలో భాగమై ఆయనను భారతదేశ ఇంచార్జ్
11:44గా నియమించినట్లు ఈ పరిచర్య కథనంలో
11:47చెప్పబడుతుంది. ఇది మనకు గుర్తు చేసే
11:50వాక్యం దేవుడు మనలో తనకు ఇష్టమైన సంకల్పము
11:56కలగజేయుటకును
11:57జరిగించుటకును కార్యసిద్ధి కలుగచేయువాడు
12:01ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రెండవ
12:04అధ్యాయము 13వ వచనము మనిషి ఒక ద్వారం
12:08తెరవవచ్చు కానీ దేవుడు తెరిచిన ద్వారం
12:12పరిచర్యను కొత్త స్థాయికి తీసుకెళ్ళగలడు
12:16ఇప్పుడు వృక్షం పైకి ఎదిగింది మొదట 14
12:21సంవత్సరాలు వేర్లు అయితే తరువాత 10
12:24సంవత్సరాలు పైకి ఎదిగిన కొమ్మలు ఆ పరిచర్య
12:28అనేక రాష్ట్రాలకు అనేక ప్రాంతాలకు దేశ
12:32విదేశాలకు విస్తరించింది. అనేకమంది
12:35సేవకులను కలుసుకొని వారిని ప్రోత్సహిస్తూ
12:39బలపరుస్తూ శిక్షణ ఇస్తూ దేవుని పరిచర్యలో
12:43ముందుకు నడిపించే ప్రయత్నం కొనసాగింది.
12:47యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ మీరు వెళ్లి
12:51సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి
12:5528 వ అధ్యాయము 19 వ వచనం కాబట్టి పరిచర్య
13:00యొక్క లక్ష్యం కేవలం జన సమూహాలను
13:04కోడగట్టడం కాదు శిష్యులను తయారు చేయడం
13:08సేవకులను బలపరచడం తరువాతి తరాన్ని సిద్ధం
13:13చేయడం సువార్తతో పాటు సేవ
13:17ఈ పరిచర్యలో సువార్త ప్రకటించడంతో పాటు
13:21కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కూడా
13:24కొనసాగింది. వరదల సమయంలో
13:28బాధితులకు సహాయం చేయడం మణిపూర్లో అవసరములో
13:32ఉన్నవారికి సహాయం చేయడం వంటి సేవా
13:35కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆఫ్రికాలోని
13:39ఉగండాలో ఒక ఆసుపత్రిని సందర్శించినప్పుడు
13:44మంచాలు లేక నేలపై పడుకొని చికిత్స
13:47పొందుతున్న రోగులను చూసి స్పందించి వారికి
13:51అవసరమైన బెడ్లను ఏర్పాటు చేయడానికి సహాయము
13:56చేసిన సంఘటన కూడా ఈ పరిచర్యలోని సేవా
13:59హృదయాన్ని చూపిస్తుంది.
14:02యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 17వ
14:07వచనం చెబుతుంది విశ్వాసము క్రియలు లేనిదై
14:11ఉంటే అది తనంతటా అదే మృతము అందుకే నిజమైన
14:17విశ్వాసం మాటలలో మాత్రమే ఉండదు విశ్వాసం
14:22ప్రేమగా కనిపించాలి ప్రేమ సేవగా మారాలి
14:26సేవ ఒకరి జీవితంలో మార్పును తీసుకురావాలి.
14:31పరిచర్య పెరుగుతున్న కొద్దీ బాధ్యత కూడా
14:34పెరుగుతుంది. ఒక చిన్న విత్తనం పెద్ద
14:37వృక్షంగా మారినప్పుడు దాని నీడలో అనేకమంది
14:41విశ్రాంతి పొందుతారు. అలాగే దేవుడు ఒక
14:45పరిచర్యను పెంచినప్పుడు ఆ పరిచర్య ద్వారా
14:48అనేకమంది జీవితాలు బలపడాలి. ఒకటి
14:52కోరిందీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ
14:56వచనం ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము
15:01కాదని తెలుసుకొని స్థిరులై కదలని వారై
15:05ప్రభువు కార్యమందు ఎల్లప్పుడును సమృద్ధిగా
15:09ఉండుడి ఈ వాక్యం ఈ ప్రయాణానికి ఒక అందమైన
15:14సారాంశం కొండల్లో ప్రారంభమైన అడుగులు
15:19గిరిజన ప్రాంతాల్లో చేసిన పరిచర్య అనాధ
15:23పిల్లల కోసం చేసిన సేవ సేవకులను బలపరచడం
15:27అనేక రాష్ట్రాలకు విస్తరించడం దేశ
15:30సరిహద్దులు దాటి సేవ చేయడం ఇవన్నీ ఒకే
15:34విషయాన్ని చెబుతున్నాయి. దేవుని చేతిలో
15:38పెట్టబడిన చిన్న విత్తనం ఆయన సమయములో
15:42గొప్ప వృక్షం అవుతుంది. ప్రార్థన ఉండాలి
15:46వాక్యం ఉండాలి వినయం ఉండాలి త్యాగం ఉండాలి
15:51ప్రేమ ఉండాలి పరిశుద్ధత ఉండాలి. అప్పుడు
15:55మాత్రమే పరిచర్య తరతరాలకు ఫలిస్తుంది.
16:00సీయోన్ రాజ్కుమార్ గారి పరిచర్య
16:02ఇప్పటివరకు సాగిన ప్రయాణం దేవుని కృపకు
16:07సాక్ష్యంగా నిలిచింది. దేవుడు ఆయనకు మరింత
16:11జ్ఞానాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని
16:14అభిషేకాన్ని అనుగ్రహించును గాక. ఆయన
16:18కుటుంబ సభ్యులకు కూడా సమృద్ధిగా
16:21ఆశీర్వదించును గాక ఇప్పటివరకు బలపరచబడిన
16:25సేవకులు మరింతమందిని బలపరిచే వారిగా
16:29తయారవుదురు గాక ఇప్పటివరకు శిష్యులుగా
16:32తయారైనవారు మరింతమంది శిష్యులను తయారు
16:36చేయుదురు గాక నేను నిన్ను ఆశీర్వదించెదను
16:41నీవు ఆశీర్వాదముగా ఉండెదవు ఆదికాండము 12వ
16:46అధ్యాయము రెండవ వచనం దేవుడు సీయోన్
16:50రాజ్కుమార్ గారిని ఆయన కుటుంబాన్ని
16:54నిండుగా ఆశీర్వదించి
16:56బహుగా వాడుకొనును గాక ఆమెన్